
బిగ్ బాస్ ఇంట్లో రిలేషన్స్, టాస్కులు, గొడవలు కామన్ అయ్యాయి. పదో సీజన్ లో షాలినీ ట్రాక్ బాగా క్లిక్ అయింది. రోహిత్, తనకు మధ్యలో అపూర్వ వస్తోందని షాలినీ నానా రచ్చ చేసింది. నామినేషన్స్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్లంతా పాయింట్ల గురించి మాట్లాడుకున్నారు. షాలినీ కనీసం డ్యాగర్ల కోసం పోరాడింది.. ఝాన్సీ ఇమ్యూనిటీ వద్దని డ్యాగర్లను త్యాగం చేసిందని అగ్ని పరీక్ష టీంతో అపూర్వ చెప్తుంది.
ఝాన్సీని పక్కన పెట్టుకునే రోహిత్, అమన్, చరణ్, అపూర్వ మాట్లాడుకుంటారు. ఈ పాయింట్లన్నీ మళ్లీ నామినేషన్లో పెడుతుంది.. ఈ మాటలన్నీ ఆ టీమ్ కి చెప్తుందని రోహిత్, అమన్ అంటారు. అయితే నేను వెళ్లిపోతా మీరు మాట్లాడుకోండి అని ఝాన్సీ అంటుంది. నువ్వు ఇటు సైడ్ ఉండి ఆట ఆడితే ఇంకో లెవెల్లో ఉండేదని అమన్ అంటాడు. వాళ్లేమీ మనల్ని విడగొట్టాలని చూడటం లేదు.. మనం ఎదుటి వాళ్లతో ఎలా ఉంటే మనతో వాళ్లు అలా ఉంటారని ఝాన్సీ అంటుంది.
టాస్క్ కోసం ఇద్దరిద్దరూ జట్టుగా విడిపోవాలని బిగ్ బాస్ చెప్పగానే గొడవ మొదలైంది. మీరు అసలు నన్ను మీ గ్రూపులోకి స్వాగతిస్తున్నట్టుగా కూడా అనిపించడం లేదని అపూర్వ స్టార్ట్ చేయగానే అసలు మా మధ్యలోకి ఎందుకు వస్తున్నావ్.. శ్రిష్టికి నాకు ఎందుకు గొడవలు పెడుతున్నావ్.. నిన్ను ఎందుకు సింక్ చేశాడు.. నన్ను ఎందుకు సేవ్ చేశాడు అంటూ పోల్చి చూస్తున్నావంటూ షాలినీ ఫైర్ అవుతుంది. మధ్యలో త్రిగుణ్, సుధీర్ టాపిక్ వస్తుంది, సుధీర్ తో పెళ్లి కావాలని అన్నావ్ కదా అని రామ్ ప్రసాద్ అంటే అది సరదాగా అన్నానంటూ అపూర్వ చెప్తుంది.
అక్కడో పెద్ద గొడవ జరుగుతుంది. చివరకు అపూర్వ కన్నీరు పెట్టుకుంటుంది. సరదాగా అన్న మాటల్ని సీరియస్ గా చేస్తున్నారని అపూర్వ ఎమోషనల్ అవుతుంది. రోహిత్ ఒకప్పుడు నాతో క్లోజ్ గా ఉండేవాడు అని చరణ్ అంటే అంటే ఇప్పుడు ఉండటం లేదు.. అది నా వల్లే అని అంటున్నావా అని షాలినీ మళ్లీ అలుగుతుంది. ఇదే ఎపిసోడ్ లో వర్షిణి తన ఇంటి పరిస్థితులు, జీవితంలో దొరకని నాన్న ప్రేమను తలచుకుంటూ ఏడుస్తుంది. ముకేష్ చేయి పట్టుకుని నాన్న ఓ భరోసా ఇచ్చినట్టు ఉంటుందని త్రిగుణ్ తో చెప్తూ కన్నీరు పెట్టుకుంటుంది వర్షిణి.




.webp)
.webp)
